శ్రేయోభిలాషి అగ్రి డెవలపర్స్ సంస్థ కస్టమర్లకు నమ్మకమైన, నాణ్యమైన అగ్రికల్చర్ ల్యాండ్స్, ఫామ్ ల్యాండ్స్ అందించేందుకు నెలకొల్పబడిన సంస్థ. భూమి మీద పెట్టుబడులు పెడితే లాభాలొస్తాయన్నది జగమెరిగిన సత్యం కానీ… ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మేము మాత్రం క్లియర్ టైటిల్ ఉండి, లీగల్ గా ఏరకమైన చిక్కులు లేని ప్రాపర్టీని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము.
తెలుగు నేల మీద చాలామంది వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినవారే. ఆధునిక కాలంలో చదువు, ఉద్యోగాల కారణంగా పుట్టి పెరిగిన గ్రామాలను వదిలి పట్టణాలకు వలస వస్తున్నారు. ఈ క్రమంలో వారు పుట్టి పెరిగిన ఊరిలో వ్యవసాయ భూములు, ఆస్తిపాస్తులు అన్నీ అమ్ముకుని పల్లెటూర్లతో బంధాలు తెంపేసుకుంటున్నారు. కానీ కరోనా లాంటి ఉపద్రవాలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో ప్రతి నగర జీవి తనకూ ఒక ఎకరం వ్యవసాయ భూమి ఉంటే బాగుండని ఆలోచనలో పడ్డారు. కాంక్రిట్ జంగల్, రణగోణ ధ్వనులతో కూడిన నగరజీవితానికి విరామమిచ్చి పచ్చని ప్రకృతి ఒడిలో ఒక గంట గడిపినా చాలు అన్న భావనలో ఉన్నారు. ఇప్పుడు నగర వాసులు వ్యవసాయ భూముల కొనుగోలుపై దృష్టి సారిస్తున్నారు. అర ఎకరం, ఎకరం, ఐదెకరాలు, పదెకరాలు ఇలా తమ బడ్జెట్ లో ఎంత వస్తే అంత కొనుగోలు చేయడానికిమక్కువ చూపుతున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా ఫామ్ ల్యాండ్స్, అగ్రిల్చర్ ల్యాండ్స్ ను అందించే ప్రయత్నం మా శ్రేయోభిలాషి అగ్రి డెవలపర్స్ సంస్థ చేస్తున్నది. కస్టమర్లకు ప్రాక్టికల్ గా ఏం చేస్తాం… ఏం చేయొచ్చు?.. ఏఇలా ది మంచి, ఏది చెడు అనే విషయాలను ముందుగానే సవివరంగా చెప్పి వారి నమ్మకాన్ని చూరగొంటున్న సంస్థ మాది. లీగల్ గా అన్నిరకాలుగా సరైన భూమి అని నిర్ధారించుకున్న తర్వాతే శ్రేయోభిలాషి ఆ భూమిని కస్టమర్లకు సూచిస్తుంది.
అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనుకున్నా… సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో భయాలతో వెనుకడుగు వేస్తున్నవారికి మేము భరోసా ఇస్తున్నాం. వందశాతం క్లియరెన్స్ ఉన్న భూములను మాత్రమే మేము సజెస్ట్ చేస్తాము. అంతేకాదు అనుభవం కలిగిన న్యాయ నిపుణులతో ఆయా ప్రాపర్టీ లీగాలిటీ చెక్ చేసిన తర్వాతే కస్టమర్లకు సూచిస్తాము. అడ్డగోలు లాభాపేక్షతో కాకుండా రీజనబుల్ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటూ మా సంస్థ కస్టమర్లకు సర్వీస్ అందిస్తున్నది. ఈ ప్రయత్నం ఫలప్రదం కావాలని కస్టమర్ల ఆశీర్వాదం అందిస్తారని ఆశిస్తూ….