Hyderabad To Yadadri Express Highway

July 25, 2024
0 Comments

Govt To Built Express Highway From Hyderabad To Yadadri  and They are Planning to Reach the Location in just 30 min: హైదరాబాద్ నుంచి యాదాద్రి వెళ్లేందుకు ఎక్స్​ప్రెస్ హైవే నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఆలయాన్ని అభివృద్ధి చేసి రహదారులు మరచిపోయిందని ఆరోపించారు. అందుకే ప్రస్తుతం ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేసిందని తెలిపారు.

 

రహదారులకు పెద్దపీట : గతంలో ప్రభుత్వానికి రహదారులు అభివృద్దిపై ఎన్నోసార్లు వినతిపత్రాలు అందజేసినా ఎవ్వరూ పట్టించుకోలేదని గుర్తుచేశారు. అందుకే ఇప్పుడు రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు వివరించారు. యాదాద్రిని యాదగిరిగుట్టగా పేరు మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపినట్లు చెప్పారు. అలాగే జిల్లాలో అన్ని రకాల ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

” రూ.210 కోట్లతో మిషన్​ భగీరథ నీటి పనులు చేపడతాం. నెలలోగా టెండర్లు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ మొదటివారంలో కానీ రెండోవారంలో మంచి నీరు వస్తాయి. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడుతున్నాం. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తాం.” – కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి

భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు సంబంధించి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు సరఫరా గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగానే దానికోసం రూ.210 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. రాబోయే రెండు సంవత్సరాల్లో బస్వాపూర్ పూర్తి చేస్తామని, ఇందుకోసం టెండర్లను పిలవబోతున్నట్లు వెల్లడించారు. రైతాంగానికి మేలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలో చెప్పిన విధంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగష్టు 15లోగా రూ.2లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. త్రాగునీటి, మురికి కాలువలు సంబంధించి ఏ సమస్య వచ్చినా తనకు కానీ, ప్రజాప్రతినిధులకు తెలియజేస్తే సంబంధిత అధికారులతో పరిష్కరిస్తామని చెప్పారు.